: ఆంక్షలు లేని తెలంగాణ కావాలి: విద్యాసాగర్ రావు


ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటయ్యే తెలంగాణలో భద్రాచలం భాగంగా ఉండాలన్నారు. తమకు దక్కని తెలంగాణ ముక్కలు కావాలని లగడపాటి, చిరంజీవి చూస్తున్నారని ఆయన విమర్శించారు. డిసెంబర్ 15న రన్ ఫర్ యూనిటీ పేరిట పరుగు నిర్వహిస్తున్నామని, వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటులో అందరినీ భాగస్వాములను చేస్తున్నామని విద్యాసాగర్ రావు వెల్లడించారు.

  • Loading...

More Telugu News