: 'మోడీ ద్వారా.. మోడీ కొరకు.. మోడీ యొక్క'


బీజేపీ అంటే.. మోడీ ద్వారా, మోడీ కొరకు, మోడీ యొక్క అని కాంగ్రెస్ అభివర్ణించింది. లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న తెహల్కా తేజ్ పాల్ ను రక్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ బీజేపీ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ ఇలా స్పందించింది. బీజేపీ ఆరోపణలు ఆ పార్టీకే వర్తిస్తాయని పేర్కొంది. గుజరాత్ లో మహిళ ఫోన్ ట్యాపింగు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోడీని రక్షించడానికి బీజేపీయే ప్రయత్నిస్తోందని మహిళా కాంగ్రెస్ చీఫ్ శోభాఓజా ఆరోపించారు. మహిళలపై వేధింపుల విషయంలో ఎడిటర్ అయినా, ముఖ్యమంత్రి అయినా తమ పార్టీ విధానం ఒకటేనన్నారు. తేజ్ పాల్ చర్యలను తామేమీ సమర్థించడం లేదని వివరించారు.

  • Loading...

More Telugu News