: 12 గంటలకు కు జీవోఎం భేటీ
ఈ మధ్యాహ్నం 12 గంటలకు జీవోఎం భేటీ కానుంది. ఈ సమావేశంలో చిదంబరంతో షిండే, జైరాం రమేష్ భేటీ కానున్నారు. వీరు ప్రధానంగా హైదరాబాద్ స్టేటస్, రెవెన్యూ పంపకాలపైనే చర్చించనున్నట్టు సమాచారం. దీనికితోడు, తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచే అంశంపై కూడా చర్చించనున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్నట్టుగా నివేదిక పూర్తైతే వెంటనే కేంద్ర కేబినెట్ ను సమావేశపరచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.