: టీజీవో నేత దీక్ష భగ్నం


భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపొద్దని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మంలో చేస్తున్న ఆమరణ దీక్షను ఈ తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావు గత నాలుగు రోజులుగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఆయన శరీరంలో షుగర్ లెవెల్స్, బీపీ తగ్గడంతో వైద్యుల సూచన మేరకు పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో తెలంగాణవాదులు, ఉద్యోగసంఘాల నేతలు పోలీసులకు అడ్డుపడ్డారు. దీంతో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తినా, పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు.

  • Loading...

More Telugu News