: తెహల్కాకు మరో ఎదురుదెబ్బ


తెహల్కాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన మేనేజింగ్ ఎడిటర్ షోమాచౌదరి తన పదవికి రాజీనామా చేశారు. తెహల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ తన సహ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తేజ్ పాల్ ను కాపాడేందుకు షోమాచౌదరి ప్రయత్నిస్తోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తెహల్కాలో పనిచేసిన యంగ్ జర్నలిస్ట్ కేసు ఉదంతంలో ఆమె బాధితురాలికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News