: హైదరాబాద్ యూటీకి చొరవతీసుకోండి: జైపాల్ రెడ్డిని కోరిన జేడీ శీలం
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని సీమాంధ్ర కేంద్ర మంత్రి జేడీ శీలం ఈ రోజు ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ ను యూటీ చేయడానికి సహకరించాలని జైపాల్ రెడ్డిని జేడీ శీలం కోరారు. అంతేకాకుండా, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్య పూరిత వాతావరణం నెలకొనేలా చొరవ తీసుకోవాలని కోరినట్టు శీలం తెలిపారు.