: కొవ్వు పెరిగితే క్యాన్సరొస్తుంది
మన ఆహారంలో కొవ్వు పదార్ధాలు కూడా ఉండాలి. కానీ సరైన మోతాదులో ఉంటేనే మంచిది. అలాకాకుండా మోతాదుకు మించి కొవ్వు పదార్ధాలను తీసుకుంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఇదే విషయాన్ని పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం నిర్వహించి మరీ చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే దాని ప్రభావం వల్ల భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని మిషిగన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి ఆహారపదార్ధాలను తీసుకోవడం వల్ల కేన్సర్ ముప్పు పెరగడమే కాకుండా తీవ్రమైన కేన్సర్‌లను సూచించే ప్రత్యేక జన్యు సంకేతాలు కూడా కణుతులలో ఉద్భవిస్తాయని చెబుతున్నారు. కొవ్వు పదార్ధాలను తీసుకోవడం వల్ల సాధారణంగా బరువు పెరుగుతుంటారని కానీ అధిక బరువు వల్ల కేన్సర్ వచ్చే విషయంపై తమ పరిశోధనలో దృష్టి సారించలేదని, కొవ్వుతో కూడిన ఆహారం రొమ్ము కేన్సర్‌కు కారణమవుతుందా? అనే విషయంపైనే తాము పరిశోధన చేశామని ఈ పరిశోధనలో పాల్గొన్న రిచర్డ్ స్వ్కార్జ్ చెబుతున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని రిచర్డ్ చెబుతున్నారు.