: ఆ పుస్తకం వెల 87 కోట్లు!


ఒక పుస్తకం వెల ఎంతుంటుంది... మహా అయితే వేలల్లో ఉంటుంది. అయితే ఒక పుస్తకం వెల మాత్రం కోట్లలో ఉంది. దీని అసలు వెల ఎంతో తెలియదుగానీ... దీన్ని వేలం వేస్తే అది కోట్ల ధర పలికిందట. ప్రస్తుతం అమెరికాగా చెబుతున్న భూభాగంలో ప్రచురితమైన మొట్టమొదటి పుస్తకంగా భావిస్తున్న ప్రార్ధన గీతాల గ్రంధాన్ని వేలం వేస్తే అది అక్షరాలా 87 కోట్ల ధర పలికిందట. 'ద బే సామ్‌ బుక్‌' గా చెబుతున్న ఈ పుస్తకాన్ని ఇంత ధర వెచ్చించి పుస్తక ప్రియులు సొంతం చేసుకున్నారట. మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లో స్థిరపడిన ప్యూరిటన్లు హిబ్రూలో రచించిన అసలు పాత నిబంధనల గ్రంధం నుండి అనువదించి 1640లో ప్రచురించిన ఈ పుస్తకాన్ని సోతెబే సంస్థ మంగళవారం నాడు వేలం వేయగా ఇది అంత ధర పలికిందట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా ఇది రికార్డు సృష్టించిందట.

  • Loading...

More Telugu News