: చర్యలు తీసుకుంటే పార్టీలో ఎవరూ మిగలరు: గంటా


సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకుంటే పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ సహా సీమాంధ్ర నేతలంతా సంతకాలు పెట్టి సోనియాకు లేఖ పంపిన విషయాన్ని గుర్తు చేశారు. చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని సూచించిన ఆయన, పీసీసీ చర్యలు తీసుకోవాలనుకుంటే అందరికీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. తమ పార్టీలోని వ్యక్తులు వేరే పార్టీ వైపు చూడటం లేదని, పార్టీలే పక్క పార్టీలపై కండువాలు వేస్తున్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని గంటా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News