: పిల్లలపై లైంగిక నేరాలకు ప్రత్యేక న్యాయవాదులను నియమించండి: ఢిల్లీ హైకోర్టు
దేశంలో రోజు రోజుకు చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక నేరాలపై వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను నియమించాలని ఢిల్లీ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లోగా ప్రతి జిల్లా కోర్టులో న్యాయవాదులను ఎంపిక చేయాలంది. ఈ మేరకు ఓ స్టేటస్ రిపోర్ట్ ను మూడు వారాల్లోగా ఫైల్ చేయాలని చీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ మన్మోహన్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ చెప్పింది. న్యాయవాదులను నియమించేందుకు అవసరమైన చర్యలను ఢిల్లీ ప్రభుత్వం తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలిచ్చింది.