: ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: పార్థసారథి
'లెహర్' తుపాను దగ్గరికొస్తున్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను బలవంతంగా అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి చెప్పారు. లెహర్ తుపాను ధాటికి సముద్రపు అలలు అర కిలోమీటరు వరకు ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. నదులు కలిసే ప్రాంతంలో సముద్రపు నీరు సుమారు ఐదు కిలో మీటర్ల వరకు చొచ్చుకొస్తుందన్నారు. అయితే, తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలిస్తామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆర్మీ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చన్నారు. కోస్ట్ గార్డ్, ఆర్మీ, వివిధ బలగాల నుంచి సహకారం కూడా ఉంటుందన్నారు.