: పోటీ పరీక్షలో ఫెయిల్ అయిన పదివేలమంది బీహార్ ఉపాధ్యాయులు


ఆంగ్లం, గణితంలో సామర్థ్యం గల వారిని గుర్తించేందుకు బీహార్ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షలో పదివేల మందికి పైగా ఉపాధ్యాయులు ఫెయిలైనట్లు అధికారులు తెలిపారు. గతనెల నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 43,447 మంది హాజరవగా, 32,833 మంది పాసయ్యారని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అమర్జిత్ సిన్హా చెప్పారు. అంటే దాదాపు 10వేల మంది (24శాతం) ఫెయిలయ్యారన్నమాట. ఐదవ తరగతికి సంబంధించిన ఆంగ్లం, గణితం, హిందీ, జనరల్ నాలెడ్జ్ లో ఉపాధ్యాయుల సామర్ధ్యాన్ని పరీక్షించేందుకే ఈ పరీక్ష నిర్వహించామని సిన్హా తెలిపారు. ఫెయిలైన వారు వారి నైపుణ్యాన్ని పెంచుకోవటం లేదా వృత్తిని విడిచిపెట్టడం చేయాలన్నారు.

  • Loading...

More Telugu News