: ధావన్ అర్ధ సెంచరీ.. భారత్ 95/2
శిఖర్ ధావన్ ధాటిగా ఆడుతున్నాడు. సహచరులు వెనుదిరుగుతున్నా ఏకాగ్రత కోల్పోకుండా అర్ధ సెంచరీ సాధించాడు. ఆరంభం నుంచి బౌలర్లపై అధిపత్యం ప్రదర్శించిన శిఖర్ ధావన్ కేవలం 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా సెంచరీకి చేరువైంది. 17 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 95 పరుగులు చేసింది. క్రీజులో ధావన్(51) కు జతగా యువీ (15) ఆడుతున్నాడు. విండీస్ బౌలర్లలో రవి రాంపాల్... రోహిత్ శర్మ(4), విరాట్ కోహ్లీ(19) వికెట్లు తీశాడు.