: రోహిత్ అవుట్.. భారత్ 54/1
భారత్, విండీస్ ల మధ్య జరుగుతున్న చివరి వన్డేలో 264 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోని దెబ్బతగిలింది. నాలుగో ఓవర్లోనే రాంపాల్ బౌలింగ్ లో డారెన్ బ్రావోకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుటయ్యాడు. ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు శిఖర్ ధవన్(25) భారీ షాట్లతో విరుచుకుపడగా, రోహిత్ శర్మ(4) కుదురుకునే లోపే అవుటయ్యాడు. దీంతో ధవన్ కు కోహ్లీ జత కలిశాడు. ప్రస్తుతం టీమిండియా 8 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అర్ధసెంచరీ మార్కు అధిగమించింది. క్రీజులో ధవన్, కోహ్లీ(17) ఉన్నారు. రాంపాల్ ఒక వికెట్ తీశాడు.