: భారత్ విజయ లక్ష్యం 264
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు విజయ లక్ష్యాన్ని 264 పరుగులుగా నిర్దేశించింది. బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా బౌలర్లను అడ్డుకుని విండీస్ బ్యాట్స్ మన్ మంచి స్కోరు సాధించారు. గాయం కారణంగా గేల్ మ్యాచ్ కు దూరమైనా పావెల్(70), శామ్యూల్స్(71), డారెన్ బ్రావో(51) అర్థ సెంచరీలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేశారు. చివర్లో స్యామి(37) ధాటిగా ఆడడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా... భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జడేజాలు తలో వికెట్ తీసుకున్నారు.