: సంచలనాల తెహెల్కా పత్రిక భవిష్యత్తు ఏంటి..?


స్టింగ్ ఆపరేషన్లతో దేశ పత్రికా రంగంలో సంచనాలు సృష్టించిన తెహల్కా పత్రిక భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పత్రికా వ్యవస్థాపకుడైన తరుణ్ తేజ్ పాల్ లైంగిక దాడి కేసులో ఇరుక్కోవడంతో ఇప్పటికే పత్రిక ప్రతిష్ఠకు విఘాతం కలిగింది. దీనికితోడు ఈ వ్యవహారం వెలుగు చూశాక.. ఐదుగురు సీనియర్ జర్నలిస్టులు తెహల్కాలో విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో తెహల్కా ప్రభ గతం కావచ్చని తెలుస్తోంది.

ఈ పత్రికలో తృణమూల్ ఎంపీ, పారిశ్రామికవేత్త కేడీ సింగ్ కు 65 శాతం వాటా ఉంది. గత రెండేళ్లలో ఆయన 20 శాతం వరకు విక్రయించేశారు. రానున్న రోజుల్లో మిగతా వాటా కూడా విక్రయించి పూర్తిగా బయటపడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 'వాటా విక్రయించాను.. విక్రయిస్తాను' అంటూ కేడీ సింగ్ కూడా స్పష్టం చేశారు. అయితే, తాజా వ్యవహారాన్ని తెహల్కా పత్రిక చక్కగా హ్యాండిల్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గతవారం పత్రిక మేనేజింగ్ ఎడిటర్ శోమాచౌదరి కూడా.. ఆర్థిక పరమైన చిక్కుల వల్లే తరుణ్ పై చర్యలు తీసుకోలేదని చెప్పడం.. పత్రిక ఆర్థిక సమస్యల్లో ఉందని తెలియజేస్తోంది.

  • Loading...

More Telugu News