: హృదయాకారపు ద్వీపం ఇంకా అమ్మడుపోలే..
ప్రియుడి 50వ పుట్టిన రోజు కానుకగా ఏంజెలినాజోలీ హృదయాకారపు ద్వీపాన్ని కొనుగోలు చేసిందంటూ వస్తున్న వార్తలను ఆ ఐలాండ్ యజమానులు తోసిపుచ్చారు. ద్వీపం ఇప్పటికీ అమ్మకానికి ఉందని.. ధర 2 కోట్ల డాలర్లుగా జోసెఫ్, బార్బరా మస్సారో దంపతులు స్పష్టం చేశారు. అమెరికాలోని మన్ హట్టన్ కు ఉత్తరంగా 50 మైళ్ల దూరంలో పుత్నం కౌంటీలోని మహోపాక్ జలపాతంలో ఇది ఉంది.