: అంగారకుడి శిలను తవ్విన రోబో యంత్రం


అంగారక గ్రహంపై జీవం ఉనికికి సంబంధించిన పరిశోధనలు కొనసాగుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' పంపిన రోవర్ క్యూరియాజిటీ ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. అరుణగ్రహంపై వున్న ఓ శిలను రోవర్ తన డ్రిల్లింగ్ వ్యవస్థను ఉపయోగించి తొలిచింది. దీని నుంచి రోబో యంత్రం నమూనాలు సేకరించి, రోవర్ లో వున్న ప్రయోగశాలకు అందజేసింది. అక్కడ పరీక్షలు నిర్వహించి, ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేదా? అన్న విషయాన్ని తేలుస్తారు.   

  • Loading...

More Telugu News