: ఉగ్రవాదులు, తీవ్రవాదులకు స్వర్గంగా బీహార్: బీజేపీ


ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు బీహార్ స్వర్గధామంగా మారిందని బీజేపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తవ్వడాన్ని పురస్కరించుకుని నితీష్ సర్కారు విడుదల చేసిన రిపోర్ట్ కార్డ్ అంతా అసత్యాల మయమని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ పాట్నాలో ఆరోపించారు. ఈ ఏడాది జూన్ లో విశ్వాస ఘాతకానికి పాల్పడి మంత్రి వర్గం నుంచి తమను తొలగించిన తరువాత రాష్ట్రాన్ని వినాశనం దిశగా తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. మంత్రి వర్గ విస్తరణ జరిపితే జనతాదళ్(యూ)లో అసంతృప్తి పెల్లుబికి తన స్థానానికే ఎసరు వస్తుందని నితీష్ భయపడుతున్నారని విమర్శించారు. 18 శాఖలను నితీష్ కుమార్ తన వద్దే ఉంచుకోవడంతో పలు కీలక అంశాల్లో అభివృద్ధి పడకేసిందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News