: సీఎస్ ను కలిసిన రైల్వే జీఎం
ముంచుకొస్తున్న లెహర్ తుపాను దృష్ట్యా రైల్వేల పరంగా తీసుకోవాల్సిన ముందస్తు రక్షణ చర్యలపై చర్చించేందుకు రైల్వే జీఎం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశమయ్యారు. తుపాను వల్ల ఏర్పడే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైళ్ల రాకపోకలను పర్యవేక్షించనున్నట్టు జీఎం తెలిపారు. లెహర్ తుపాను తీవ్రమైనదిగా, దీని వల్ల, రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన రైల్వే జీఎం... సీఎస్ తో సమావేశమయ్యారు.