: భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని షిండే అవమానిస్తున్నారు: పయ్యావుల
రాష్ట్ర విభజన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెడతామని చెప్పి భారత రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని అవమానపరుస్తూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనలు చేస్తున్నారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాల విభజన ప్రక్రియ బిల్లు పార్లమెంటుకు, శాసనసభకు రావాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉండాలని తెలిపారు. షిండే మాత్రం రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని గౌరవించకుండా ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకువస్తామని చెప్పడం చూస్తే కేంద్ర మంత్రి రాష్ట్రపతిని రబ్బరు స్టాంపుగా భావిస్తున్నట్టు ఉందని పయ్యావుల మండిపడ్డారు.