: ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ బహిష్కరించింది. భీం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న గోపాల్ సింగ్ రావత్ కు వ్యతిరేకంగా పలువురు కార్యవర్గ సభ్యులు ప్రచారం నిర్వహించారు. దీనిపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్ కామత్ ఆదేశాల మేరకు వారిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News