: లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కరానికి సుప్రీంకోర్టు కమిటీ
దేశంలో పెరిగిపోతున్న లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ పరిష్కరిస్తుంది. ఓ మహిళా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీలో పదిమంది సభ్యులుగా ఉంటారు. వారిలో ఆరుగురు మహిళా సభ్యులు, మరో ఇద్దరు సుప్రీంతో సంబంధంలేని బయటి వ్యక్తులు ఉంటారు.