: బాక్సర్ విజేందర్ కు ఊరట


బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ కాంస్య పతక విజేత విజేందర్ కుమార్ కు ఊరట లభించింది. పంజాబ్ పోలీసుల అదుపులో ఉన్న ఓ మాదకద్రవ్యాల డీలర్..  విజేందర్ తన కస్టమర్ అని చెప్పడం సంచలనం రేపింది. మొహాలీ జిల్లాలో జిరాక్ పూర్ లోని ఆ డీలర్ ఇంటి ఎదుట విజేందర్ కారు నిలిపి ఉంచడంతో ఈ బాక్సర్ పై అనుమానాలు రేకెత్తాయి. అయితే విచారణ జరిపిన పోలీసులు విజేందర్ కు ఈ మాదకద్రవ్యాల డీలర్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. కారును విజేందర్ మిత్రుడు అక్కడ నిలిపి ఉంచినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News