: సీఎస్ తో అశోక్ బాబు భేటీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సచివాలయంలో ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలు, రాష్ట్ర విభజన వంటి పలు అంశాలపై వీరు చర్చిస్తున్నారు. కాగా ఈసారి మెరుపు సమ్మెకు తాము సిద్ధమని ప్రకటించిన అశోక్ బాబు... కేంద్రం విభజన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో సీఎస్ తో సమావేశమవ్వడం విశేషం.