: నిన్నటి వరకు సమైక్యాంధ్ర అన్న జైపాల్ రెడ్డి ప్లేటెందుకు ఫిరాయించారు: గాలి
నిన్నటి వరకు సమైక్యాంధ్ర అంటూ పల్లవి ఆలపించిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఉన్నట్టుండి ఎందుకు ప్లేటు ఫిరాయించారని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రల్లో పొత్తులు ఎవరితో ఉంటాయో సీఎం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగువారంటే గిట్టని వారినే సోనియా జీవోఎం సభ్యులుగా నియమించారని మండిపడ్డారు. తెలుగు వారిపై సోనియా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోనియా చేతిలో సమైక్యాంధ్రపై ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. రచ్చబండలో ప్రజా సమస్యలకంటే ఆర్భాటాలకే పెద్దపీట వేస్తున్నారని అని ముద్దుకృష్ణమ విమర్శించారు.