: యూవీపై ధోనీకి ఎంత నమ్మకమో..!


యువరాజ్ సింగ్ పై భారతజట్టు కెప్టెన్ ధోనీకి అపారమైన నమ్మకం ఉంది. ఇటీవలే విశాఖలో విండీస్ తో జరిగిన రెండో వన్డేలో యువరాజ్ కేవలం 28 పరుగులకు అవుటయ్యాడు. 49 బాల్స్ ను తిన్నాడు. పైగా విండీస్ ఆటగాడు సిమన్స్ ఇచ్చిన క్యాచ్ జారవిడిచాడు. దీనిపై మీడియా ప్రశ్నలకు ధోనీ స్పందిస్తూ.. 'బ్యాటింగ్, బౌలింగ్ గురించి పక్కన పెట్టండి. ఎవరైనా క్యాచులను వదిలేస్తారు. దీన్ని సమస్యగా చూడకండి' అంటూ హితవు పలికాడు. 'యువరాజ్ బాగా ఆడాలని మేమంతా కోరుకుంటున్నాం. 4వ స్థానంలో తను బాగా ఆడగలడు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చేయగలడు. కాకపోతే గత కొన్ని మ్యాచులలో యూవీ ఇబ్బందులు పడ్డాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది సహజం' అంటూ సెలవిచ్చాడు.

  • Loading...

More Telugu News