: గాలి, అలీఖాన్ లకు 14 వరకు సీబీఐ కస్టడీ


ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధనరెడ్డి, అలీఖాన్ తో పాటు మరో నలుగురిని మార్చి 14 వరకు సీబీఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. బెంగళూరు సెంట్రల్ జైలు సమీపంలోని సీబీఐ కోర్టులో గాలితో పాటు ఇతరులను ఈరోజు పోలీసులు హాజరు పరిచారు.

ఈ సందర్భంగా సీబీఐ అధికారులు వారిని కస్టడీకి అప్పగించాలని కోరడంతో న్యాయస్థానం అనుమతించింది.
 కాగా, అంతకుముందే విచారణ కోసం హైదరాబాదు చంచల్ గూడ జైలు నుంచి గాలి, అలీఖాన్ లను బెంగళూరు తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News