: అత్యాచారయత్నం చేసిన రైల్వే పోలీసు
కంచే చేను మేస్తోంది.. అత్యాచారాలను నిరోధించాల్సిన పోలీసులే అత్యాచారాలకు పాల్పడుతూ వ్యవస్థకే కళంకం తెస్తున్నారు. కీచకులకు సరైన శిక్ష పడకపోవడంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థినిపై ఓ రైల్వే పోలీసు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.