: మహబూబ్ నగర్ జిల్లాలో 19 ప్రైవేటు బస్సుల సీజ్
రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో 45వ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 19 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాదుకు వస్తున్న బస్సులను షాద్ నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనుమతుల్లేని బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం సీజ్ చేసిన బస్సులను నాగోలులోని రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.