: తనిఖీల ప్ర్రక్రియ కొనసాగుతోంది : డీజీపీ దినేష్ రెడ్డి


హైదరాబాద్, సైబరాబాద్ లలో తనిఖీల ప్ర్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందని డీజీపీ దినేష్ రెడ్డి వెల్లడించారు. శివరాత్రి వరకు విస్తృతంగా తనిఖీలు కొనసాగుతాయన్నారు. అయితే, ప్రస్తుతం నిఘా వర్గాలు సాధారణ హెచ్చరికలే జారీ చేశాయని చెప్పారు. దిల్ సుఖ్ నగర్ ఘటనపై మాట్లాడుతూ, 3 నిమిషాల వ్యవధిలో రెండు జంట పేలుళ్లు జరిగాయన్నారు.

పేలుళ్లకు 20 నిమిషాల ముందు ఇద్దరు సైకిళ్లపై
 వెళ్లడం సీసీటీవిలో నమోదైందని తెలిపారు. వాణిజ్య భవనాలకు సీసీటీవీలు లేకుండా అనుమతి ఇచ్చేది లేదన్న ఆయన, విద్యుత్ తో సంబంధం లేకుండా బ్యాటరీలతో సీసీటీవిలు పని చేస్తాయన్నారు. కాగా, జంట నగరాల పరిధిలో మొత్తం 3,500 హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News