: మగువలు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా వుంటే మంచిది


వయసు పెరిగిన మగువలు కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకుంటే వారికి పలు రకాలైన జబ్బులు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. షుగరు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌ తాగడం వల్ల స్థూలకాయం, డయాబెటిస్‌, గుండె జబ్బులు, కేన్సర్‌ వంటి జబ్బులు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశ దాటిన మహిళలు తియ్యగా ఉండే పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భాశయ లోపలి పొరల్లో కేన్సర్‌ ఏర్పడే ముప్పు ఉందని పరిశోధకులు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

షుగరు ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ తీసుకున్న మహిళల్లో ఈస్ట్రోజన్‌ ఆధారిత టైప్‌-1 కేన్సర్‌ ప్రమాదం 78 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. సాధారణ మహిళలతో పోలిస్తే వీరిలో ఈస్ట్రోజన్‌, ఇన్సులిన్‌ నిల్వల స్థాయి పెరగడం మామూలేనని దీనివల్ల గర్భాశయ కేన్సర్‌ సోకే ప్రమాదం ఉందని మిన్నెసోటా వర్సిటీకి చెందిన మాకి ఇనోవ్‌ ఛోయ్‌ అనే పరిశోధకుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వయసు పెరిగిన మగువలు తీపి ఎక్కువగా ఉండే డ్రింక్స్‌ను కాస్త దూరంగా ఉంచితే మంచిది.

  • Loading...

More Telugu News