: దానానికి వయసుతో నిమిత్తం లేదు


ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న... అన్న విషయాన్ని ఆ చిన్నారి చిన్న వయసులోనే తెలుసుకుంది. అందుకే ఇప్పుడు రికార్డుపుటలకు ఎక్కింది. చిన్న వయసులోనే మూలకణాలను దానం చేసేందుకు ముందుకొచ్చి తన దానగుణాన్ని ఎలుగెత్తి చాటింది.

మూలకణాల దాతల వయసు కచ్చితంగా 16 ఏళ్లు ఉండాలని గత ఏడాది బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత ఇంగ్లండ్‌లోని మాకెల్స్‌ ఫీల్డ్‌కు చెందిన 17 ఏళ్ల విక్టోరియా అనే బాలిక మూలకణాలను దానం చేయడానికి ముందుకొచ్చిన అతి చిన్న వయస్కురాలైన తొలి దాతగా గుర్తింపు పొందింది. లుకేమియాతో బాధపడుతున్న గుర్తు తెలియని రోగికి మూలకణాలను దానం చేసేందుకు విక్టోరియా ముందుకొచ్చింది. ఆమె చదివే పాఠశాలలో ఒక ధార్మిక సంస్థ మూలకణ దాతల పేర్లను నమోదు చేసుకుంది. ఈ నమోదు కార్యక్రమంలో తన పేరును నమోదు చేయించుకున్న ఆరు నెలలకే విక్టోరియా తనకంటే పెద్ద వయసులో ఉన్న ఒక రోగికి మూలకణాలను దానమివ్వబోతోంది.

  • Loading...

More Telugu News