: సీఎం సమర్థ పాలన అందిస్తున్నారు: రుద్రరాజు పద్మరాజు
క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి సమర్థ పాలన అందిస్తున్నారని విధాన మండలి ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. హైదరాబాద్ లో మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో కిరణ్ అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూశారని, తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. ఇరు ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకునే కిరణ్ సమైక్యవాదం అంటున్నారే తప్ప హీరో అయ్యేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు.