: ఐబీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు: కిషన్ రెడ్డి


రాయల తెలంగాణపై ఐబీ నుంచి తనకు ఎలాంటి ఫోన్లు రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ నిఘా సంస్థలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని అన్నారు. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణకే బీజేపీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు.

నాలుగు జిల్లాలతో కూడిన రాయల సీమకు సాంస్కృతికంగా ప్రత్యేక అస్తిత్వం ఉందని, దాన్ని ధ్వంసం చేసే ఆలోచనకు బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించదని కిషన్ రెడ్డి అన్నారు. ఒక వేళ రాయల తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రయత్నం జరిగినా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా సరే 10 జిల్లాల తెలంగాణ సాధిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News