: రాయల తెలంగాణపై ఐబీ అభిప్రాయసేకరణ మంచి పరిణామం: జేసీ
రాయల తెలంగాణపై ఇంటిలిజెన్స్ బ్యూరో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించడం శుభపరిణామమని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాయల తెలంగాణ కోరడమంటే తెలంగాణను అడ్డుకోవడం కాదన్నారు. అయితే, రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ శాసనసభ్యులు వ్యతిరేకించడం దురదృష్టకరమన్నారు. అందుకు నేతలు సానుకూలంగా ఉన్నప్పటికీ బహిరంగంగా మాత్రం చెప్పేందుకు వెనకంజ వేస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు. అమ్మ ఏది చెబితే అదే జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఢిల్లీ పెద్దలను వారించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగుతున్నారన్నారు.