: ఓటింగ్ జరిగితే తీర్మానం నెగ్గకపోవచ్చు: వీహెచ్
రాష్ట్ర విభజనపై అనవసరంగా సోనియాగాంధీని విమర్శిస్తున్నారని తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. సోనియాను తప్పుబట్టడం మంచిది కాదని సూచించారు. అబద్దాలతో రాజకీయ లబ్ది పొందాలని పలువురు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో మూడొంతుల మంది సీమాంధ్రులే ఉన్నందున... సభలో తీర్మానం ఆమోదం పొందడం కష్టమేనని వీహెచ్ అభిప్రాయపడ్డారు. శాసనసభకు బిల్లు వస్తే మంచిదేనని అన్నారు.