: దక్షిణాఫ్రికా టూర్ కు టీం ఎంపిక.. జహీర్, అంబటి రాయుడులకు ఛాన్స్
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరగనున్న రెండు టెస్టులు, మూడు వన్డేలకు బీసీసీఐ టీమ్ ను ప్రకటించింది. ఇటీవలి రంజీ ట్రోఫీలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన టీం ఇండియా పేసర్ జహీర్ ఖాన్ కు టెస్టుతో పాటు వన్డే జట్టులో స్థానం దక్కింది. అలాగే హైదరాబాదీ క్రికెటర్ అంబటి రాయుడుకు కూడా రెండు జట్లలో స్థానం లభించింది. అయితే వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ లకు మరోసారి అవకాశం మిస్ అయింది.
ఫస్ట్ టెస్ట్ డిసెంబర్ 18 నుంచి న్యూ వాండరర్స్ లో , రెండో టెస్టు డిసెంబర్ 26 నుంచి డర్బన్ లో జరుగుతాయి. అలాగే, మెదటి వన్డే డిసెంబర్ 5న జొహానెస్ బర్గ్ లో, రెండో వన్డే డిసెంబర్ 8న డర్బన్ లో, మూడో వన్డే డిసెంబర్ 11న సెంచూరియన్ లో జరుగుతాయి.
టెస్ట్ జట్టు...
ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మురళీ విజయ్, శిఖర్ ధవన్, పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రెహానే, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా.
వన్డే జట్టు...
ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధవన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రెహానే, యువరాజ్ సింగ్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, జహీర్ ఖాన్, అంబటి రాయుడు, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అమిత్ శర్మ.