: హైదరాబాద్ ను యూటీ చేయొద్దు: జైపాల్ రెడ్డి


హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయొద్దని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయిన సందర్భంగా జైపాల్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని కోరారు. భద్రాచలాన్ని కూడా తెలంగాణలోనే ఉంచాలని సూచించారు. తెలంగాణ బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలి, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సోనియాగాంధీకి వివరించారు.

  • Loading...

More Telugu News