: ఆరుషి హత్య కేసులో నేడే తుది తీర్పు
సంచలనం సృష్టించిన ఆరుషి-హేమ్ రాజ్ ల జంట హత్యల కేసులో ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో పోలీసులు, కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి అయింది. ఐదు సంవత్సరాల కిందట అంటే 2008 మే 15, 16 తేదీల్లో వైద్య దంపతులు రాజేష్, నూపుర్ తల్వార్ ల టీనేజ్ కుమార్తె ఆరుషి తల్వార్ తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తర్వాతి రోజే ఇంట్లో పనిచేసే హేమ్ రాజ్ కూడా హత్య కావడం పలు అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలో పలు మలుపులు తిరిగిన కేసు చివరకు యువతి తల్లిదండ్రులనే అనుమానించేలా చేసింది. దాంతో, పోలీసులు అరుషి తండ్రిని అరెస్టు చేశారు. అనంతరం సీబీఐ చేసిన దర్యాప్తులో ఎవరినీ నిందితులుగా పేర్కొనకపోగా, ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు ఈ కేసు అంతుచిక్కని మిస్టరీగానే మిలిగింది. ఈ నేపథ్యంలో, ఈ జంట హత్యల కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది.