: ఈ స్కిప్పింగ్ రోప్ బాగుంది
మనం బరువు తగ్గడానికి చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. నిజానికి బరువు వేగంగా తగ్గాలనుకునేవారు ఇతర వ్యాయామాలకన్నా స్కిప్పింగ్ ద్వారానే ఎక్కువ వేగంగా బరువు తగ్గుతారు. అయితే ఇలా స్కిప్పింగ్ చేసే సమయంలో ఎన్ని చేశామని మనం లెక్కించుకోవడం కష్టం. అలాగే మనం రోజూ చేసే ఈ వ్యాయామం వల్ల మన శరీరంలోని ఎన్ని కేలరీల కొవ్వు కరిగింది? అనే విషయాన్ని సరిగ్గా లెక్కించలేము. అందుకే, ఇప్పుడు అలాంటి పనిని చేసే సరికొత్త స్కిప్పింగ్ రోప్‌ను రూపొందించారు.
ఈ డిజిటల్ స్కిప్పింగ్ రోప్ మనం చేసే స్కిప్పింగ్ వల్ల ఎన్ని కేలరీలు కరిగాయి, అలాగే ఎన్నిసార్లు మనం తాడుని ఉపయోగించామనే విషయాన్ని లెక్కగట్టి మనకు చెబుతుంది. ఈ లెక్కలను బేరీజు వేసుకుని చక్కగా మనం వ్యాయామం చేసే సమయాన్ని పెంచుకోవడం, లేదా తగ్గించుకోవడం చేయవచ్చు. కెలోరీ బర్నింగ్ జంపింగ్ రోప్గా పిలిచే ఈ సరికొత్త స్కిప్పింగ్ రోప్‌లు పలు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి.