: ఈ రోబో ఎగిరిపోతుంది


మామూలుగా నేలపై తిరిగే రోబోల గురించి మనం విన్నాం. చూసికూడా ఉంటాం. అలాకాకుండా గాల్లో ఎగిరే రోబో గురించి పెద్దగా వినలేదు. అలా గాల్లో ఎగురుతూ నీటిలో పడి మునిగిపోతున్న వారిని రక్షించే సరికొత్త రకం రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబో గాల్లో చక్కగా ఎగురుతూ మునిగిపోతున్న వారిని రక్షించేందుకు అవసరమైన పరికరాలను వారికి అందిస్తుందట.

శాస్త్రవేత్తలు జీపీఎస్‌తో పనిచేసే కొత్త రోబోను తయారుచేశారు. గాలిలో ప్రయాణిస్తూ వెళ్లి నీటిలో మునిగిపోతున్న వారికి ప్రాణరక్షణ పరికరాలను అందించేలా దీన్ని తయారుచేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. పార్స్‌ అని పిలుస్తున్న ఈ రోబో సెకనుకు పది మీటర్ల వేగంతో 4.5 కిలోమీటర్ల దూరంపాటు ఏకధాటిగా ప్రయాణించిందని, అత్యవసర పరిస్థితుల్లో నీటిమీద దిగేలా కూడా ఈ నిర్మాణాన్ని తగినవిధంగా రూపొందించాలని దీని తయారీదారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే బ్యాటరీతో నడిచే ఈ రోబో సామర్ధ్యాన్ని మరింతగా పెంచేందుకు కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News