: రాష్ట్రానికి పొంచి ఉన్న లెహర్ తుపాను ప్రమాదం
రాష్ట్రానికి లెహర్ తుపాను ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. అండమాన్ దాటాక లెహర్ తుపాను బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఆ శాఖ కమిషనర్ పార్థసారధి తెలిపారు. లెహర్ తుపాను ప్రభావంపై రేపు కానీ ఎల్లుండి కానీ ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. హెలెన్ కంటే లెహర్ తుపాను ప్రభావం ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాగా లెహర్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో కచ్చితంగా తెలియదని శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.