: యానాంలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటన


హెలెన్ తుపాను కారణంగా నష్టపోయిన యానాంలో ప్రాంతంలో ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి వి. నారాయణస్వామి, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి పి. వైద్యలింగం, పీసీసీ చీఫ్ సుబ్రమణియన్ బృందం పర్యటించారు. రాజీవ్ బీచ్ లో ధ్వంసమైన నావలను, నేలకొరిగిన పంటచేలను పరిశీలించారు. పరిపాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్నారు. పుదుచ్ఛేరి రాష్ట్ర ప్రభుత్వం జరిగిన నష్టంపై కేంద్ర హోం శాఖకు నివేదిక పంపిస్తే నష్టపరిశీలనకు కేంద్ర బృందాన్ని పంపిస్తామని నారాయణస్వామి హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News