: లేడిపిల్ల అనుకుని ప్రియురాలిని వేటాడాడు


అది అమెరికాలోని జార్జియా.. మాథ్యూ టైలర్ వెబ్(23), తన ప్రియురాలు ఆండ్రే మాయో కలిసి డాబాపైకి వెళ్లారు. సమీపంలోని అడవుల్లో చెంగు చెంగున ఎగురుతున్న లేడిపిల్లలు కనిపించాయి. మాథ్యూ తుపాకీతో వేటకు బయల్దేరాడు. ముందు రానని చెప్పిన ప్రియురాలు ఆండ్రే.. ప్రియుడు మాథ్యూను ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంది. చెప్పా పెట్టకుండా మాథ్యూ వెంటే వచ్చి పొదల్లో నక్కింది. ఆమె అలికిడి విన్న మాథ్యూ లేడి పిల్లనుకుని కాల్చాడు. కెవ్వుమంటూ ప్రియురాలి కేక వినిపించేసరికి మాథ్యూ పరుగున వెళ్లాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్ ఆమె కాలికి తగలడంతో గుడ్డతో కట్టుకట్టి ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కానీ, మాథ్యూపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News