: సమైక్యంగా ఉంచేంత వరకు ఆందోళన: న్యాయవాదుల సంఘం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు మరో నెల రోజుల పాటు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సీమాంధ్ర న్యాయవాదులు తీర్మానించారు. రాష్ట్ర సమైక్యత కోరుతూ 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులతో కడప కేఎన్ఆర్ కళ్యాణ మండపంలో న్యాయవాదుల సదస్సు జరిగింది. సీమాంధ్ర జిల్లాల న్యాయవాదుల రాష్ట్ర కన్వీనర్ జయకర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విభజన బిల్లు పార్లమెంటులో చర్చించే సమయంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి డిసెంబరు 20 వరకు పోరాటం చేయాలని సదస్సు తీర్మానించింది. 13 జిల్లాల్లోని న్యాయవాదులు విధులు బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని నిర్ణయించారు.