: 50 అడుగుల లోతు బావిలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి


బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమిళనాడు కోయంబత్తూరు విదుర్ నగర్ జిల్లా రాజుపాళయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటలకు 25 మంది ప్రయాణీకులతో బయల్దేరిన ఆమ్నీ బస్సు తెల్లవారుజామున 5 గంటలకు రాజుపాళయం చేరుకుంది. అక్కడ 17 మంది ప్రయాణీకులు దిగారు. అక్కడికి మరో 4 కిలో మీటర్ల దూరం ప్రయాణించి రోడ్డు ప్రక్కన కాలకృత్యాలు తీర్చుకుంటున్న ఆంటోనీ(55)ని ఢీకొట్టి, రాజుపాళయం వైపు వెళ్తున్న టౌన్ బస్సును గుద్ది సమీపంలో ఉన్న 50 అడుగుల లోతు బావిలో నిలువుగా పడిపోయింది.

చిమ్మచీకట్లో ప్రయాణీకులంతా నిద్రమత్తులో ఉండగా అకస్మాత్తుగా పెద్దశబ్ధం రావడంతో కళ్లు తెరచి చూసి హాహాకారాలు చేశారు. దీంతో గ్రామస్థులు ..పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందిచారు. వారు తీవ్రంగా గాయపడ్డ 9 మందిని రక్షించి సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో ఇద్దరు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో బావిలో రెండు అడుగుల లోతు నీరు మాత్రమే ఉండడంతో కొంత మందైనా బ్రతికి బట్టకట్టగలిగారని స్థానికులు అంటున్నారు. రోడ్డు మలుపులో ఉన్న ఈ బావిలో పడి మరణించిన వారెందరో లెక్క లేదని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News