: మహిళల రక్షణకు ప్రత్యేక కమెండోలు: ఢిల్లీ ప్రజలకు బీజేపీ హామీ
తమకు అధికారం కట్టబెడితే ఢిల్లీలో మహిళల రక్షణకు ప్రత్యేక కమెండో దళాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అలాగే మహిళలపై కేసుల విచారణకు సత్వర విచారణ కోర్టులను ఏర్పాటు చేస్తామని తెలిపింది. బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాల రాజధానిగా డిల్లీకి పడిన పేరును రూపుమాపుతామని, తమ తొలి ప్రాధాన్యం ఇదేనని చెప్పారు.