: ఏం కావాలో అడిగి ఇచ్చేస్తే పోయేదేమో: ఏటీఎం దాడి బాధితురాలు
ఏం కావాలో అడిగి.. కావాల్సినవన్నీ ఇచ్చేస్తే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో... అంటూ బెంగళూరు నగరంలో ఏటీఎం కేంద్రంలో కత్తిదాడికి గురైన బాధితురాలు, కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే, ఇప్పటికీ ఆమె శరీరంలో ఎడమవైపు భాగం చచ్చుబడే ఉంది. ఒక ప్రైవేటు టీవీ చానల్ ఆస్పత్రిలో జ్యోతిని పలకరించగా.. పై విధంగా అన్నారు. దాడి జరిగిన సమయంలో నోటి వెంట మాట రాలేదని చెప్పారు. తన కాళ్లకు ఇప్పుడు స్పర్శ లేకుండా పోయిందని చెప్పారు.