: ఢిల్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి: మోడీ


ఢిల్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ఎన్నికలు ముఖ్యమైనవన్నారు. ఢిల్లీ ప్రజలకు కనీసం తాగునీరు అందించడంలో సైతం షీలా దీక్షిత్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. యమునా నది ఒడ్డునే ఉన్నా తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. గుజరాత్ లోని ఎడారి ప్రాంతాల ప్రజలకు కూడా తాగునీరు అందిస్తున్నామన్న మోడీ, ఢిల్లీ కంటే చిన్న రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందున్నాయన్నారు.

  • Loading...

More Telugu News